Sorakaya Pesarapappu:శరీరంలో వేడిని తగ్గించే సొరకాయ పెసర పప్పు..
Sorakaya Pesarapappu:సొరకాయ పెసర పప్పు.. శరీరంలో కొవ్వును తగ్గించి చలువ చేసే సొరకాయ కూర ఎక్కువగా ఇష్టపడరు. కాని కాసింత పెసర పప్పు జోడించి చేసి చూడండి తప్పకుండా నచ్చుతారు.
కావాల్సిన పదార్ధాలు
సొరకాయ – 1
పెసర పప్పు – ½ కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి – 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – ½ టీస్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
కరివేపాకు – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.సొరకాయను ముందుగా తురిమి పెట్టుకోవాలి.
2.పెసరపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర,ఉల్లిపాయల తరుగు వేసి వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక అందులోకి పచ్చిమిర్చి ,కరివేపాకు,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు వేగనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి సొరకాయ తురుము వేసి బాగా కలుపుకోని మూతపెట్టి ఉడికించుకోవాలి.
6.సొరకాయ బాగా ఫ్రై అయ్యాక అందులోకి తగినంత ఉప్పు వేసి నానబెట్టుకున్న పెసర పప్పును యాడ్ చేసుకోవాలి.
7.సొరకాయ పెసరప్పును కలుపుతూ పదినిమిషాల పాటు ఉడకించుకోవాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మని సోరకాయ పప్పు కూర రెడీ.