Chia Seeds For Weight Loss:బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా.. ఈ గింజలతో చెక్..
Chia Seeds For Weight Loss : Chai Seeds లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు అరుదుగా దొరికిన.. ప్రస్తుతం చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిలో కనపడుతుంది. అధిక బరువు అనేది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అధిక బరువును మరియు శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మార్కెట్ లో దొరికే మందులను వాడవలసిన అవసరం లేదు.
ఒక గ్లాస్ లో ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ తేనె, ఆరచెక్క నిమ్మరసం, గోరువెచ్చని నీరు పోసి బాగా కలిపి పావు గంట అలా వదిలేయాలి. అప్పుడు చియా సీడ్స్ జెల్లీలా ఉబ్బుతాయి. ఈ నీటిని ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే శరీరంలో కొవ్వు కరగటం ప్రారంభం అవుతుంది.
బరువును మరియు శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి చియా సీడ్స్ లో ఉన్న ఫైబర్ సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. చియా గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లో ఎక్కువ భాగం ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
మంచి ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు టాక్సిన్స్ మరియు అదనపు కొవ్వును శరీరం నుండి బయటకు పంపుతుంది. కాల్షియం, ఫాస్పరస్ సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగుతూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తే ఫలితం చాలా తొందరగా వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.