Beauty Tips

White Hair:హెయిర్ డై వాడకుండానే.. తెల్లజుట్టును నల్లగా మార్చవచ్చు…ఎలా…?

White Hair Turn Black:తెల్లజుట్టు సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. తెల్లజుట్టు సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా కొత్తగా తెలజుట్టు రాకుండా ఉంటుంది.

ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది ఇలా చిన్న వయసులో తెల్ల జుట్టు రావటంతో మానసికంగా క్రుంగిపోతు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటాకతెల్ల జుట్టు అనేది వచ్చేది.

అసలు తెల్ల జుట్టు రావడానికి గల కారణం మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం ఉత్పత్తి తగ్గడం. మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బంగాళదుంప తొక్క తెల్ల జుట్టును నల్లగా మారుతుంది ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ ఇది నిజం మనం బంగాళదుంప కూర చేసుకున్నప్పుడు బంగాళదుంప పై తొక్క తీసి పాడేస్తూ ఉంటాం

ఆ బంగాళదుంప తొక్కను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బంగాళదుంప తొక్కలో ఉండే పిండి పదార్థాలు తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడతాయి. దీనికోసం 2 బంగాళదుంప తొక్కలను రెండు కప్పుల నీటిలో ఉడికించి చల్లారాక ఆ నీటిని వడగట్టి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చ.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/