Kitchenvantalu

Beerakaya Ulli Karam:బీరకాయ ఉల్లికారం కూర ఈజీగా.. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కూర..

Beerakaya Ulli Karam:బీరకాయ ఉల్లికారం.. బీరకాయ అంటే చాలా వరకు ఇష్టంగా తినరు. ఏదైనా స్పెషల్ గా యాడ్ చేసి చేస్తే తప్ప ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ ఇష్టపడరు. అందుకే బీరకాయతో ఉల్లికారం చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బీరకాయ – ½ kg
ధనియాలు – 1 ½ టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 7-8
కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -5-6
పసుపు – ½ టీస్పూన్
ఉప్పు – 1 స్పూన్
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా బీరకాయను పొట్టుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ధనియాలు వేసి వేపుకోవాలి.
3.అందులోకి జీలకర్ర,నువ్వులు ,ఎండుమిర్చి ,కొబ్బరి ,వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.వేపుకున్న దినుసులను ప్లేట్ లోకి తీసుకోని చల్లారనివ్వాలి.

5.ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేపుకోవాలి.
6. ఉల్లిపాయలు వేగాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి కలుపుకోని మూతపెట్టి ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు చల్లారిన మసాలా దినుసులను మిక్స్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు ఉడుకుతున్న బీరకాయలో ఉప్పు,గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి మరో ఐదు నిమిషాలు ఉడికంచుకోవాలి.
9.చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ ఉల్లికారం రెడీ.