Paneer Bhurji:ఎక్కువ మసాలాలు లేకుండా చపాతీలోకి త్వరగా చేసుకొనే సూపర్ కర్రీ
Paneer Bhurji:పన్నీర్ భుర్జీ.. ఎంతో బలమైనా పన్నీర్ రెసిపీస్ అంటే అందరు ఇష్టపడ్తారు. ఇంట్లోనే ఇన్ స్టంట్ గా పన్నీర్ భుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
పన్నీర్ – 200 గ్రాములు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 3-4
జీలకర్ర – ½ టీ స్పూన్
ఉప్పు – 1 స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా పన్నీర్ తురుముకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు,పచ్చిమర్చి తరుగు,ఉప్పు వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ ,ధనియాల పొడి ,పెప్పర్ పౌడర్ వేసి కలుపుకోవాలి.
4.మసాలాలు వేగిన తర్వాత అందులోకి తురుముకున్న పన్నీర్ వేసి కలుపుకోని మూతపెట్టి రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
5.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ భుర్జీ రెడీ.