Kitchenvantalu

Aloo Kofta Curry:చపాతీ, పురీ, రైస్ లోకి రుచికరమైన కర్రీ.. తింటే అసలు వదిలిపెట్టరు

Aloo Kofta Curry:ఆలు కోఫ్తా..వెజ్ స్పెషల్స్ అంటే ముఖ్యంగా ఆలు ఉండాల్సిందే. ఆలు కోప్తా స్పెషల్ ఒక్క సారి రుచి చూసారంటే అసలు వదిలిపెట్టకుండా  చేసేస్తారు.

కావాల్సిన పదార్ధాలు
బంగాళ దుంపలు – ¼ kg
శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి – 1
కొత్తిమీర – ½ కప్పు
కారం -1/2 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
గ్రేవీ కోసం..
ధనియాలు – 1 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 2
టొమాటో – 3
ఆయిల్ – తగినంత
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.లేదంటే తురుమి పెట్టుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి కార్న్ ఫ్లోర్ ,శనగపిండి,పచ్చిమిర్చి,కొత్తిమీర తరుగు,కారం,ఉప్పు వేసి కలుపుకోవాలి.
3.మొత్తం మిశ్రమాన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి.
4.అరచేతిలో కొద్దిగా నూనె రాసుకోని పిండిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి.
5.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె ను వేడిచేసి కోప్తాలను వేసి మీడియం ఫ్లేమ్ పై ఉడకించాలి.
6.గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి.

7.ఇప్పుడు గ్రేవీ కోసం ఉల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
8.టోమాటోలను కూడ ప్యూరీగా సిద్దం చేసుకోవాలి.
9.ఇప్పుడు బాండీలో నూనె వేసి వేడి చేసి అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
10.ఇప్పుడు అందులోకి పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,రెడీ చేసుకున్న టోమాటో ప్యూరీ ని వేసి మూత వేసి మీడియం మంట పై ఫ్రై చేసుకోవాలి.
11.టమాటో నుంచి ఆయిల్ తేలుతున్నప్పుడు అందులోకి కారం,ఉప్పు,ధనియాల పొడి వేసి గ్రేవీకి సరిపడా నీళ్లను కలుపుకోని గరం మసాలి వేసి రెండు,మూడు నిమిషాలు ఉడికించాలి.
12.గ్రేవీ మరిగిన తర్వాత అందులోకి తయారు చేసుకున్న కోఫ్తాలను వేసి కలుపుకోవాలి.
13.చివరగా కరివేపాకు వేసి ఐదారు నిమిషాలు ఉడికంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే.