Kitchenvantalu

Jeera Rice:ఇంట్లోనే జీరా రైస్ ని ఇలా రెస్టారెంట్ స్టైల్ లో చేయండి

Jeera Rice:జీరా రైస్..ఈజీ డైజేషన్ అయిపోయే జీరా రైస్ ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.అచ్చం హోటల్ స్టైల్లో జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి రైస్ – 2 కప్పులు
జీలకర్ర – 2 టీ స్పూన్స్
దాల్చిన చెక్క – 3 ఇంచెస్
యాలకులు – 3
బిర్యానీ ఆకు – 2
లవంగాలు – 5
పచ్చిమిర్చి – 3
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 1 టీ స్పూన్
జీడిపప్పులు – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యిని వేసి వేడిచేసుకోవాలి.
3.అందులోకి జీలకర్ర, మసాలా దినుసులు,జీడిపప్పులు వేసి వేపుకోవాలి.
4.మసాలాలు వేగాక పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.

5.పచ్చిమిర్చి వేగాక అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి.
6.బాగా మిక్సి చేసుకోని అందులోకి మూడు కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి.
7.అరగంట నానబెట్టకున్న బియ్యానికి ఒక కప్పు బియ్యానికి 1 ½ కప్పుల నీళ్లను ,బియ్యం నానబెట్టకుండా చేసినట్టయితే రెండు కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి.
8.రుచికి సరిపడా ఉప్పును వేసి హై ఫ్లేమ్ పై ఉడికించి ,దగ్గర పడ్డాక లోఫ్లేమ్ లోకి మార్చుకోవాలి.
9.మూత వేసి ఐదునిమిషాలు తక్కువ మంట పై ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ