Kitchenvantalu

Ragi Soup:మిక్స్ వెజ్ రాగి సూప్ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు

Ragi Soup:రాగి సూప్..రాగి జావా,రాగి దోశ ,రాగి లడ్డులు స్పెషల్స్ టేస్ట్ చేసే ఉంటారు.రాగి పులుసు ఎప్పుడైనా ట్రై చేసారా. బరువు తగ్గాడానికి ఈ రెసిపి ఎంతగానో ఉపయోగ పడుతుంది.ఈసారి చేసి చూడండి.

కావాల్సిన పదార్దాలు
రాగిపిండి – 2-3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – ¼ టీ స్పూన్స
వెజిటెబుల్స్ – సరిపడా

తయారీ విధానం
1.ముందుగా రాగి పిండిలో నీళ్లను కలిపి పల్చగా కలుపుకోవాలి.
2.ఇప్పుడు ప్యాన్ లో నెయ్యివేసి అందులోఇక జీలకర్ర,ఎండుమిర్చి,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
3.ఇప్పుడు క్యారేట్ నచ్చిన కూరగాయ ముక్కలు ఏవైనా వేసి వేపుకోవాలి.
4.వేగిన కూరగాయ ముక్కల్లో మూడుకప్పుల నీళ్లను వేసి మిరియాల పొడి,తగినంత ఉప్పు వేసి  కలిపి మూతపెట్టుకోని ఎసరు మరగనివ్వాలి.
5.ఎసరు మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ద్రవాన్ని వేసి కలుపుకోవాలి.
6.రుచి చూసుకోని మిరియాల పడి,ఉప్పు ను కలుపుకోని పది ,పదిహేను నిమిషాలు మరిగించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి సూప్ రెడీ.