Palakura Tomato Curry:పాలకూర, టమాట కలిపి వండితే.. ఆహా.. ఆ టేస్టే వేరు..!
Palakura Tomato Curry:పాలకూర టమాటో కర్రీ..కంటికి ఆరోగ్యాన్నిచ్చే పాలకూర మన ఆహారం లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. పప్పు,ఫ్రై కాకుండా టమాటో తో పాలకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
పాలకూర – 2 కప్పులు
టొమాటోస్ – 3
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 4
పసుపు – ½ టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు కాస్త వేగాక పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
3.అందులోకి పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,వేసి వేపుకోవాలి.
4.అల్లంవెల్లుల్లి పేస్ట్ వేగాక కడిగి పెట్టుకున్న పాలకూర తరుగు వేసి కలుపుకోవాలి.
5.రెండు మూడు నిమిషాలు పాలకూర కుక్ చేసాక టమాటోముక్కలు యాడ్ చేసుకోని కలుపుకోవాలి.
6.టమాటోలు మెత్తపడ్డాక అందులోకి కారం,ఉప్పు,కప్పు నీళ్లను వేసి కలుపుకోని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు కొత్తిమీర ఆకులు వేసి కూర చిక్క పడే వరకు ఉడికించుకోవాలి.
8.గ్రేవి కాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోని పాలకూర టమాట కర్రీ సర్వింగ్ రెడీ.