Kitchenvantalu

Sorakaya Curry:సొరకాయ కూర ఇలా చేసి చూడండి.. అన్నం, చపాతీ తో సూపర్ గా ఉంటుంది

Sorakaya Curry:సొరకాయ కర్రీ..వాటర్ కంటెంట్ ఉన్న పదార్దాలు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలోవాటర్ కంటెంట్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఉన్న సొరకాయ కర్రీ చపాతీ,రైస్,పుల్కా లోకి మంచి కాంబినేషన్. సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ – మీడియం సైజ్
పచ్చిమిర్చి – 7-8
ఉల్లిపాయ – 1
ఉప్పు – 1 ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా మసాలా కోసం మిక్సి జార్ లో పచ్చిమిర్చి ,కొత్తిమీర,జీలకర్ర,ఉప్పువేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.స
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు మగ్గాక పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయే వరకు వేపుకోవాలి.
4.ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి ఉప్పు వేసుకోని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించాలి.
5.ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి అవసరం అయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.
6.మూత వేసి రెండు ,మూడు నిమిషాలు మగ్గించుకుంటే సొరకాయ కర్రీ రెడీ.