Gunta Ponganalu:కేవలం 10 నిమిషాల్లో ఆంధ్ర స్పెషల్ గుంత పొంగనాలు.. ఇలా చేసుకుంటే.. చాలా టేస్ట్ గా వస్తాయి
Gunta Ponganalu:గుంట పొంగనాలు..దోశ పిండితో చేసుకునే అతి రుచికరమైన టిఫిన్ రెసిపి గుంటపొంగనాలు. కొద్దిగా టైం పట్టినా టేస్ట్ లో మాత్రం అదిరిపోతాయి. ఎప్పుడు దోశలే కాకుండా మీపిల్లలకి గుంటపొంగనాలు వేసి తినపించండి.
కావాల్సిన పదార్ధాలు
దోస పిండి – కావలసినంత
జీలకర్ర – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
ఉల్లిపాయ ముక్కలు – ½ కప్పు
పచ్చిమిర్చి – 3
కొత్తిమీర – చిన్న కట్ట
కరివేపాకు – 2 రెమ్మలు
క్యారేట్ తురుము – ½ కప్పు
నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం ముక్కలు – 1 ఇంచ్
తయారీ విధానం
1.ముందుగా దోశ బ్యాటర్ ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోని అందులోకి పైన తీసుకున్నన పదార్ధాలన్ని వేసి కలుపుకోవాలి.
2.ఇప్పుడు పొంగనాల ప్లేట్ ఇది మార్కెట్ లో దొర్కుతుంది.
3.గుంట పొంగనాల ప్యాన్ వేడి చేసి గుంటలలో రెండు రెండు చుక్కల ఆయిల్ వేసుకోవాలి.
4.ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక గుంటలలో ముప్పావు వంతు వరకు దోశ బ్యాటర్ ని నింపుకోవాలి.
5.ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టి లో ఫ్లేమ్ పై మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.
6.ఫోర్క్ సాయంతో పొంగనాలను రెండో వైపు తిప్పుకోని మరి కాసేపు కాల్చుకుంటే గుంట పొంగనాలు రెడీ.