Neru ott release: గుడ్ న్యూస్.. తెలుగులోనూ ఓటీటీలోకి నేరు మూవీ..ఎక్కడ..ఎప్పుడు..?
Neru ott release: దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన Neru సినిమాలో మోహన్ లాల్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా మలయాళంలో గత నెలలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను మలయాళం,తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది.
థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రానుండటం నిజంగా గుడ్ న్యూసే.
అబద్దాలతో కేసు గెలవాలని ప్రయత్నించే లాయర్ ఓ వైపు…నిజం కోసం పోరాడే లాయర్ మరోవైపు…ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.