Movies

జెమినిని పెళ్లి చేసుకోవద్దని NTR,ANR చెప్పితే సావిత్రి ఏమని ఆందో తెలుసా?

మహానటి సినిమా విడుదల అయ్యాక సావిత్రి బాల్యం నుండి హీరోయిన్ గా ఎలా ఎదిగిందో అర్ధం అయింది. కానీ ఆమె చివరి దశలో అప్పులపాలయ్యి అనారోగ్యం బారిన పడి చనిపోవడానికి కారణం ఆమె భర్త జెమిని గణేశన్ అనేవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంపై ప్రతి రోజు ఎవరో ఒకరు స్పందిస్తూ మహానటి సావిత్రి అప్ అండ్ డౌన్స్ పై మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల అనేక సంచలనమైన విషయాలను వెల్లడించింది. ఆమె విజయవాడలో ఉంటున్నారు. ఈ రోజు ఆమె ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ…సావిత్రి గురించి అనేక విషయాలను తెలిపారు. సావిత్రి జెమిని గణేశన్ ని వివాహం చేసుకోబోతున్న విషయం మా అందరికి ముందుగానే తెలిసిందని, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరు జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు.

చివరగా నన్ను కూడా అడిగింది. జెమినీ గణేశన్ కి ఇంతకు ముందే పెళ్లి అయిందని,పిల్లలు ఉన్నారని పెళ్లి చేసుకోకపోవటమే మంచిదని నేను చెప్పా అని సుశీల అన్నారు.

ఎంత చెప్పిన సావిత్రి వినలేదని, సావిత్రి జీవితంలో చేసిన పెద్ద తప్పు జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకోవటమే అని, జెమిని గణేశన్ ని వివాహం చేసుకున్నాకే ఆమె జీవితం గాడి తప్పిందని సుశీల అన్నారు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సావిత్రి జీవితం మరోలా ఉండేదని సుశీల అన్నారు.