BusinessEDUCATION

JEE Main Result 2024: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి!

JEE Mains 2024 Result Session 1 : లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాలు వచ్చేసాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సంవత్సరం మొత్తం 12,31,874 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 11.70 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ఫలితాలను https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

ఈ వెబ్‌సైట్‌లో లాగినై స్కోర్ కార్డు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఎన్టీఏ మరో వెబ్‌సైట్‌ https://ntaresults.nic.in/ లో కూడా లాగినై కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.