Kitchenvantalu

Munakkaya Tomato Curry:సులువైన పద్దతిలో ములక్కాడ టమాట కర్రీ ఇలా చేయండి

Munakkaya Tomato Curry:సులువైన పద్దతిలో ములక్కాడ టమాట కర్రీ ఇలా చేయండి. కావలసిన పదార్ధాలు, తయారి విధానం వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్దాలు
లేత మునక్కాయలు – 5
టమాట – 3
ఉల్లిపాయ – 1
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమిర – 2 రెమ్మలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1స్పూన్
పసుపు – చిటికెడు
కారం పొడి – 1 స్పూన్
గరం మసాలా పొడి – 1/2 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 2 స్పూన్స్

తయారి విధానం

మునక్కాయల పై చెక్కు తీసి రెండు అంగుళాల ముక్కలుగా కోసుకోవాలి . బాణలి పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేసి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్ది సేపు వేగించాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు, అల్లం ,వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం సేపు వేగించాలి.

ఆ తర్వాత కారం, మునగకాయ ముక్కలు, సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ముక్కలు కాస్త మెత్తగా అయ్యాక, కోసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి కొంచెం వేగాక , ఒక కప్పు నీరు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. నీరు మొత్తం అయ్యి పోయాక గరం మసాలా , కొత్తిమిర వేసి కలిపి దింపాలి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి మంచి కాంబినేషన్.