Bournvita Kalakand:స్వీట్ షాప్ సీక్రెట్స్ తో బోర్న్వీటా కలాకండ్ చేస్తే..స్వీట్ ఇష్టం లేనివారు కూడా తింటారు
Bournvita Kalakand:స్వీట్ షాప్ సీక్రెట్స్ తో కలాకండ్ చేస్తే..స్వీట్ ఇష్టం లేనివారు కూడా తింటారు..స్వీట్స్ ఫేవరేట్ అనగానే,చాలా మంది చెప్పే స్వీట్ పేరు కరాఖండ్అందరూ ఇష్టపడే, కలాఖండ్ ను, కాస్త వెరైటీగా బోర్న్ వీటాతో చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
వైట్ కళాఖండ్ కోసం..
చిక్కనిపాలు – 2 లీటర్లు
పంచదార – 1 టేబుల్ స్పూన్
నిమ్మ ఉప్పు – 2 చిటికెలు
నెయ్యి – 1 టీ స్పూన్
బోర్న్ వీటా కళాఖండ్ కోసం..
చిక్కని పాలు – 1 లీటర్
బోర్న్ వీటా – 50 గ్రాములు
నిమ్మ ఉప్పు – 2 చిటికెలు
నెయ్యి – 1 టీ స్పూన్
తయరీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, చిక్కని పాలు పోసి, హై ఫ్లేమ్ పై కలుపుతూ మరిగించుకోవాలి.
2. పాలు పొంగు వచ్చాక, పంచదార, నిమ్మ ఉప్పు వేసి, మరో 20 నిముషాలు కలుపుతూ ఉంటే, పాల దగ్గరపడి, కాస్త నీరు మిగులుతుంది.
3. అప్పుడు అందులోకి బోర్న్ వీటా ,నెయ్యి వేసి, మూడు నిముషాలు బాగా కలుపుకుని, దించేసుకోవాలి.
4. ఇప్పుడు వైట్ కలాఖండ్ కోసం చిక్కని పాలు, పంచదార వేసి హై ఫ్లైమ్ పై కలుపుతూ మరిగించాలి.
5. పాలు బాగా దగ్గరపడ్డాక, నెయ్యి వేసి దించేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక ప్లేట్ కు నెయ్యి రాసి, ముందుగా వైట్ కళాఖండ్ వేసి, సమానంగా చేసుకుని, ఆపై, బోర్న్ వీటా కళాఖండ్ పోసి స్ప్రెడ్ చేసుకోవాలి.
7. ఈ ట్రేను, ఆరు గంటలు లేదా, రాత్రంతా క్లాత్ కప్పి, వదిలేయాలి.
8. ఆరిన తర్వాత నచ్చిన షేప్స్ లో కట్ చేసుకుంటే స్వీట్స్ రెడీ అయినట్లే.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ