Face Glow Tips:అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!!
Banana And Milk Face Glow Tips:అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి..ముఖం అందంగా,కాంతివంతంగా మెరవాలంటే ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో ఉండే సహజసిద్దమైన వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో మెరిసేలా చేసుకోవచ్చు.
ఈ చిట్కా కోసం అరటిపండును ఉపయోగిస్తున్నాం. అరటిపండు అన్నీ రకాల చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ లో వేయాలి.
ఆతర్వాత అరకప్పు పాలను పోసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు వారం రోజుల పాటు చేస్తూ ఉంటే ముఖం మీద నలుపు,ముడతలు అన్నీ తొలగిపోతాయి.
ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది. అరటిపండులో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన నల్లని మచ్చలు,మొటిమలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృదాప్య లక్షణాలను తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. విటమిన్ E చర్మం రక్షిత పొరను కాపాడుతుంది.
అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. చర్మం మీద ఉన్న దుమ్ము, ధూళిని లోతుగా శుభ్రం చేస్తుంది. ఈ ప్యాక్ చర్మం మీద మ్యాజిక్ చేస్తుంది. చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.