Hair Fall Tips:వయస్సు 20 దాటకముందే జుట్టు ఊడుతోందా..;? ఇలా చెక్ పెట్టండి
Hair Fall Tips:వయస్సు 20 దాటకముందే జుట్టు ఊడుతోందా..;? ఇలా చెక్ పెట్టండి..ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన జుట్టుకి సరైన పోషకాలు అందక జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా,ఆరోగ్యంగా పెరగాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
ఒక బౌల్ లో మనం రెగ్యులర్ గా వాడే షాంపూని తీసుకొని దానిలో ఒక స్పూన్ Multani Mitti Powder, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టు మెరుస్తుంది.
Multani Mitti జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లకుండ చేస్తుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా కాపాడటంలో సహాయపడుతుంది. క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అలాగే తల, మాడునుండి అదనపు నూనెను గ్రహిస్తుంది, దాంతో చుండ్రు సమస్య అనేది ఉండదు.
అంతే కాదు, ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచి కేశకణాలకు తగినంత బలాన్ని అంధించి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. కాబట్టి Multani Mitti జుట్టు సంరక్షణలో చాలా సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.