Kitchenvantalu

Kitchen Tips:అందరికీ ఉపయోగపడే ఇంతవరకూ ఎక్కడా చూడని సరికొత్త వంటింటి చిట్కాలు

Kitchen Tips:అందరికీ ఉపయోగపడే ఇంతవరకూ ఎక్కడా చూడని సరికొత్త వంటింటి చిట్కాలు..వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవుతుంది.

పాస్తా అతుక్కోకుండా రావాలంటే.. దాన్ని ఉడకబెట్టిన నీళ్లలో కొంచెం నూనె వేయాలి. ఉడికిన తర్వాత చన్నీళ్లతో కడిగి పెట్టుకోవాలి.

తోడు లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి, అందులో రెండు పచ్చిమిర్చీలు వేసి, మూత పెట్టి 12 గంటలపాటు ఉంచితే పెరుగు తోడుకుంటుంది.

చాలామంది కూరల్లో వెల్లుల్లిని చిదిమి వేస్తుంటారు. దీనికంటే వెల్లుల్లిపేస్ట్‌ వేయడం మంచింది. దీని వల్ల రుచి, వాసన పెరుగుతుంది.

టీ పెట్టిన తర్వాత ఆ పొడితో అద్దాలు, చెక్క వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు.