Biyyam pindi janthikalu:జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండిఇలా కలపండి
Biyyam pindi janthikalu:జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండిఇలా కలపండి..చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్ధాలు
బియ్యం – 250 gms
మినపప్పు – 50 gms
నూనె – 1 tbsp
ఉప్పు
వాము – 1 tbsp
నూనె – వేపుకోడానికి
నీళ్ళు – పిండి తడుపుకోడానికి
తయారీ విధానం
బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా మర ఆడించి జల్లించిన పిండి తీసుకోండి.(మిక్సీ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ కచ్చితంగా జల్లించాలి). ఇదే కేజీ కి చేసుకొంటే కేజీ బియ్యానికి 200 gms మినపప్పు, కప్పుల్లో అయితే కప్ బియ్యానికి అదే కప్ తో 5వ వంతు మినపప్పు వేయాలి.
ఈ పిండిలో ఉప్పు నూనె, నలిపిన వాము వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
జంతికల గిద్ద లో నూనె రాసి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టి, పిండి ముద్ద పెట్టి నూనె రాసిన ప్లేట్ మీద చిన్న చిన్న చుట్టలుగా వేసుకోండి, ఆ తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే కరకరలాడేట్టు వేపుకోండి.చల్లారాక డబ్బా లో వేసుకోవాలి. ఇవి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.