Diabetes Diet :షుగర్ ఉన్నవారు ఓట్స్ తింటే ఏమి అవుతుందో తెలుసా?
Diabetes Diet :షుగర్ ఉన్నవారు ఓట్స్ తింటే ఏమి అవుతుందో తెలుసా..డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి ఏ ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే.
మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్ తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. ఓట్స్ లో బీటా-గ్లూకాన్స్ అని పిలువబడే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో సహాయ పడుతుంది.
ఈ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. అలాగే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మీ శరీరంలో చక్కెరల జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓట్స్ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
ఓట్స్ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి మంచి ఆహారం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.