Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది
Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది..వాతావరణ కాలుష్యం, మారిన వాతావరణ పరిస్థితులు, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద మురికి,మృతకణాలు పేరుకుపోయి ముఖం నల్లగా, నిస్తేజంగా మారిపోయి కాంతివిహీనంగా కనపడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది.
ఈ చిట్కా కోసం ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. మన ఇంటిలో ఉండే పదార్థాలతో చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల బియ్యాన్ని వేయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ ములేటి పౌడర్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఉడికిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ ని సపరేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల గంధం పొడి, అర స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు రాసి 10 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చర్మ తత్వానికి సెట్ అయ్యేలా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై మొటిమలు, మొండి మచ్చలు, మృత శర్మ కణాలు అన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరవటానికి సహాయపడటమే కాకుండా మొటిమలు, నల్లని మచ్చలను తొలగిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.