White Hair:3 చుక్కలు… తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా ఉండేలా చేస్తుంది…సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండదు
White Hair:3 చుక్కలు… తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా ఉండేలా చేస్తుంది…సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండదు.. తెల్ల జుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చిన్న వయస్సులోనే రావటం వలన కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా సహజసిద్దమైన వాటిని వాడితే మంచిది.
కానుగ నూనె తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి అన్నీ రకాల జుట్టు సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానుగ నూనె ఆయుర్వేదం షాప్ లలో,Online Stores లలో విరివిగానే లభ్యం అవుతుంది. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది.
2 Ml కొబ్బరి నూనెలో మూడు చుక్కల Kanuga Oil ని వేసి బాగా కలిపి తల మీద మాడుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు రాస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తెల్లజుట్టు తక్కువగా ఉన్నవారికి ఫలితం చాలా త్వరగా కనపడుతుంది. ఎక్కువగా తెల్లజుట్టు ఉంటే ఫలితం కాస్త ఆలస్యం అవుతుంది.
ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. చిట్కాలు అనేవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఇటువంటి నూనెలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వీటిని మన పూర్వీకులు కూడా ఫాలో అయ్యేవారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.