Hair care tips:మోకాళ్ల వరకు హెయిర్ పెరగడానికి ఈ నూనె చాలు.. ఇలా వాడితే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది..
Hair Care Tips:మోకాళ్ల వరకు హెయిర్ పెరగడానికి ఈ నూనె చాలు.. ఇలా వాడితే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.. జుట్టు రాలే సమస్య ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
మగవారిలో అయితే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు అసలు కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మార్కెట్ లో దొరికే ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు.
మిక్సీ జార్ లో రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల ఆవనూనె, అరకప్పు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఇనుప కడాయి పెట్టి తయారుచేసుకున్న పేస్ట్ వేయాలి.
ఆ తర్వాత దానిలో వంద గ్రాముల ఆవనూనె, వంద గ్రాముల కొబ్బరి నూనె, వంద గ్రాముల ఆముదం వేసి సిమ్ లో బాగా మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకి రాసి పది నిమిషాలు మసాజ్ చేసి గంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.