Andhra Allam Pachadi:ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే నోరూరించే అల్లం పచ్చడి
Andhra Allam Pachadi:ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే నోరూరించే అల్లం పచ్చడి .. ఇడ్లీ దోశ ఉప్మా ఏ టిఫిన్స్ లోకి అయినా, పల్లీ చెట్నీతో, అల్లం చెట్నీ కూడా ఉండాల్సిందే. అల్లంలో ఘాటు, బెల్లం తీపి కలిపి, టేస్టీ అల్లం చెట్నీ తయారు చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
నూనె – 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి – 50 గ్రాములు
అల్లం తరుగు – 1/3కప్పు
బెల్లం – 1/4కప్పు
ఉప్పు -2 టేబుల్ స్పూన్లు
చింతపండు – 50 గ్రాములు
వేడి నీళ్లు – 50 – 70 ML
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 10 నుంచి 12
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో ధనియాలు, మినపప్పు, శనగపప్పు, వేసి, మీడియం ఫ్లేమ్ పై, వేపుకోవాలి.
2. వేగిన పప్పులలో, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
3. వేగిన పప్పులు, ఎండు మిర్చిని, మిక్సీ జార్లోకి వేసుకుని, అందులోకి, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4. అంతే అల్లం చెట్నీ రెడీ.