Beauty Tips

Face Glow Tips:ఈ పేస్ట్ ఇలా ముఖానికి రాస్తే చాలు.. 3 రోజుల్లో 10 సంవత్సరాల పిగ్మెంటేషన్ మాయం

Face Glow Tips:ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఈ పిండితో ఇలా చేస్తే జిడ్డు,మురికి,దుమ్ము,ధూళి తొలగి ముఖం తెల్లగా మెరుస్తుంది.. ప్రతి ఒక్కరు తెల్లగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన వంటింటిలో చాలా సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం మీద జిడ్డు, మురికి, దుమ్ము, ధూళి అన్నింటిని తొలగించుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ గోధుమపిండి, అర స్పూన్ గ్రీన్ టీ పొడి, మూడు స్పూన్ల పాలు వేసి మూడు ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మురికి అన్ని తొలగిపోతాయి.

అలాగే నల్లని మచ్చలు, మొటిమలు,డార్క్ సర్కిల్స్ కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. గోధుమ పిండి అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. గోధుమపిండి ముఖం మీద ఉండే జిడ్డు, మురికి తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గోధుమ పిండిలో ఉన్న పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

గ్రీన్ టీ ముఖం మీద ఉండే డల్ నెస్ ని పోగొట్టి ముఖం ఫ్రెష్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ముఖ చర్మంలో పొడి లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. పాలలో ఉన్న పోషకాలు చర్మానికి మంచి పోషణను అందిస్తాయి.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు,దుమ్ము,ధూళి అన్నీ తొలగిపోయి ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ ప్యాక్ తయారుచేసుకొని వాడి మంచి ఫలితాలను పొందండి. ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

గోధుమ పిండితో మరో చిట్కాలు తెలుసుకుందాం. ఒక బౌల్లో ఒక స్పూన్ గోధుమపిండి తీసుకోవాలి. దానిలో పావు స్పూన్ లో సగం పసుపు, ఆర చెక్క నిమ్మరసం, ఒక స్పూను పెరుగు, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకుని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ