Astro Tips: ఇంట్లో నెమలి పించం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
peacock feathers at home: ఇంట్లో నెమలి పించం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం.. మనవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. కొన్ని వస్తువులు వాడొచ్చని, కొన్ని వస్తువులు వాడకూడదని అలాగే కొన్ని ఇంట్లో ఉంటె మంచిదని, కొన్ని లేకుంటే మంచిదని, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.
అయితే పెద్దల ఆచారం ప్రకారం ఆచరించే పద్ధతుల్లో కొన్నింటికి శాస్త్రీయ అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇక కొన్ని మూఢ నమ్మకాలుగా వస్తున్నాయి.ఇక చాలామంది నెమలి పించం చూడగానే ఇష్టపడతారు. ముఖ్యంగా కృష్ణుడు తలపై ధరించడం వలన దీనికి డిమాండ్ కూడా ఉంది. కొందరు నెమలి పింఛాన్ని పుస్తకాల్లో పెట్టుకోవడం, బల్లులు,పురుగులు రాకుండా ఉంటాయని ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటారు.
అయితే దీనికి శాస్త్రీయ అంశాలు వెలుగు చూశాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, నెమలి పించం ఇంట్లో ఉండడం వలన ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది.గ్రహ దోషాల నివారణకు నెమలి పించం ఇంట్లో ఉంటె మంచిదని కొందరి పండితుల విశ్లేషణ.
పిల్లలు ఆకర్షితులై వారిలో ఏకాగ్రత పెంచడానికి దోహదం చేస్తుందని కొందరి వాదన. రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకునేవాళ్ళు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవాళ్ళు తలగడ కింద నెమలి పించం పెట్టుకుంటే మంచిదని అంటారు.
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటె దుష్ట శక్తులు రావని, వాస్తు దోష నివారణ కూడా అవుతుందని కూడా చెబుతారు. మొత్తం మీద నెమలి పించం ఇంట్లో ఉంటె మంచిదేనన్నమాట.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.