Skin Tags : తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. పులిపిర్లు వెంటనే రాలిపోతాయి..!
Skin Tags : తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. పులిపిర్లు వెంటనే రాలిపోతాయి.. మనలో చాలా మంది చర్మంపై పులిపిర్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పులిపిర్లు కారణంగా పెద్దగా హాని జరగపోయిన చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి.
ఈ పులిపిర్లు శరీరంలో ఏ భాగంలోనైనా వస్తాయి. ముఖం, మెడ వంటి భాగాల్లో మాత్రం మరింత ఎక్కువగా వస్తాయి. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ పులిపిర్లు హ్యూమన్ పాపిలోనా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి
పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి. పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు.
పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కూడా వస్తాయి. పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం,కాల్చటం మరియు కత్తరించటం వంటి పనులు అసలు చేయకూడదు. పులిపిర్లు మన శరీరంలో ఏ బాగంలోనైనా రావచ్చు. పులిపిర్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
పులిపిర్లు అనేవి వైరస్ కారణంగా వస్తాయి. అందువల్ల పులిపిర్లను తగ్గించుకోవటానికి తులసి ఆకులు బాగా సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో వైరస్ ని ఎదుర్కునే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
తాజా తులసి ఆకులను తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి,దాని మీద గాలి తగలకుండా ఒక టేప్ తో మొత్తం కవర్ అయ్యేలా చుట్టాలి. రెండు గంటలు అయ్యాక టేప్ తీసేసి చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. లేదా ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసిన సరిపోతుంది. నాలుగు రోజుల ఇలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.