Lakshmi Devi blessings:లక్ష్మి దేవి అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి
Lakshmi Devi blessings:సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు.
లక్ష్మి దేవి అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి.. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీ దేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట. తామర పువ్వుతో లక్ష్మీదేవిని పూజిస్తే ధనలాభం బాగా కలుగుతుంది. తామరపూవు మీద కూర్చుని సిరులు కురిపిస్తున్నట్టుగా ఉన్న లక్ష్మి దేవి చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజు పూజించాలి.
ఇలా చేస్తే సిరి సంపదలు కలగటమే కాకుండా ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుందట. ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని రోజు 11 సార్లు పఠించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు నుండి రాలి పడిన రావి ఆకును ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి సింధూరంతో ఆ ఆకుపై హ్రీం అనే అక్షరం రాయండి. ఈ ఆకును దేవుడి గదిలో ఉంచి తర్వాత శనివారం ఆ ఆకును రావిచెట్టు దగ్గర ఉంచి, మరో ఆకు తీసుకునివచ్చి మళ్లీ ఇదే పని చేయండి. అలా నాలుగు శనివారాలు చేయండి. ఇలా చేస్తే ఆర్ధిక బాధలు తొలగిపోతాయి.
శనివారం రోజు రావిచెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు పాలు, దానిలో చిన్న బెల్లం ముక్క వేసి తీసుకువెళ్లాలి . ఆ పాలను రావిచెట్టు మొదట్లో పోయండి. ఆ పాలతో తడిచిన ప్రదేశంలో ఉన్న మట్టిని తీసుకుని బొట్టులాగా పెట్టుకోండి. ఈ విధంగాచేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. లక్ష్మి దేవి అనుగ్రహం ఉండాలంటే ఏ తప్పులు చేయకూడదు. అలాగే లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఏమి చేయాలో కూడా వివరంగా తెలుసుకున్నారుగా.
మనలో చాలా మందికి దేవుని మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రకారం ఆచారాలను సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. మన పెద్దవారు పెట్టిన అన్నీ ఆచారాలకు ఒక అర్ధం ఉంది. కాబట్టి పాటించటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ