Oily Skin Tips: ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటుందా…ఈ టిప్స్ ఫాలో అయితే సరి
Oily Skin Tips: ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటుందా…ఈ టిప్స్ ఫాలో అయితే సరి.. కొంత మంది చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది. ఎన్ని సార్లు ముఖం కడిగినా…ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ముఖం జిడ్డు గానే ఉంటుంది. ఈ జిడ్డు కారణంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.
జిడ్డు తగ్గితే ఇటువంటి సమస్యలు కూడా ఉండవు. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే ముఖం మీద జిడ్డు తగ్గి చర్మం చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జిడ్డును తొలగించుకోవచ్చు.
ముఖం మీద జిడ్డును తొలగించటానికి పెరుగు చాలా సహాయపడుతుంది. పెరుగులో ఉన్న పోషకాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు,పావు స్పూన్ కాఫీ పొడి, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
కాఫీలో ఉన్న లక్షణాలు చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు వాపు, మంటను తగ్గించటమే కాకుండా చర్మ చాయను మెరుగుపరుస్తాయి. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు.
అరటిపండు కూడా ముఖం మీద జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది. ఒక బౌల్ లో అరటిపండు గుజ్జు వేసి దానిలో రెండు స్పూన్ల ఓట్స్, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి పలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.