Weight Loss:స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా స్లిమ్ గా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్
Weight Loss:స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా స్లిమ్ గా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు తగ్గుతారు.
అరస్పూన్ తేనెలో అరస్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత ఉదయం పరగడుపున తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఉదయం తీసుకోవటం కుదరని వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తీసుకోవాలి. బరువు తగ్గడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. దీనివల్ల అధిక కొవ్వు కరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా తరిమికొడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా జీలకర్ర సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాస్త ఓపిక చేసుకొని ఈ చిట్కా ఫాలో అయితే 15 రోజుల్లో చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తేనే ఫలితం బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.