Sudigali Sudheer:అందరిని నవ్వించే సుడిగాలి సుదీర్ ఎంతవరకు చదువుకున్నాడో తెలుసా?
Sudigali Sudheer:ఈ జీవితం ఎవరిని ఏ వైపుకు తీసుకువెళ్ళుతుందో ఎవరికీ తెలియదు. కష్టాలు ఎప్పుడు వచ్చిన దాని వెనక విజయం ఉంటుంది. ఆ విజయాలను అందుకొని మన పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా ముందుకు సాగితేనే విజయం వెంట ఉంటుంది.
దానికి ఉదాహరణగా సుడిగాలి సుదీర్ ని చెప్పవచ్చు. రామోజీ ఫిలిం సిటీలో పర్యాటకులకు ఆనందాన్ని కలిగించే మ్యాజిక్ చేసే మెజీషియన్, అదే రామోజీరావు నిర్వహించే ఒక ఛానల్ లో ప్రధాన కమెడియన్,యాంకర్ గా మారతాడని ఎవరైనా ఊహిస్తారా? కలలో,సినిమాల్లో జరిగే ఇటువంటి పరిణామాలు సుడిగాలి సుదీర్ కి ఎదురయ్యాయి. బ్రతకటానికే చాలా కష్టపడిన రోజుల నుంచి ఇప్పుడు కమెడియన్ గా లక్షలు సంపాదించే వరకు ఎదిగాడు సుదీర్.
సుడిగాలి సుదీర్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కళింగ పట్నం మండలం ఆచంట గ్రామం. 1987 మే 19 న రామస్వామి,లక్ష్మి దంపతులకు సుదీర్ జన్మించాడు. సుదీర్ తండ్రి ఉపాధి నిమిత్తం విజయవాడ వలస వచ్చారు. సుదీర్ విజయవాడలో ఇంటర్ మీడియేట్ ఎంపీసీ చదివాడు.
కుటుంబ పోషణ కష్టం అవ్వటం,చదువు మీద ద్యాస తగ్గటంతో సుదీర్ హైదరాబాద్ పయనం అయ్యాడు. హైదరాబాద్ లో మెజీషియన్ విద్య నేర్చుకొని చాలా రోజుల పాటు వీధులలో షోస్ చేసేవాడు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మేజిక్ షో లు నిర్వహించేవాడు.
ఆ సమయంలోనే సుదీర్ లోని టాలెంట్ గమనించిన కమెడియన్ వేణు జబర్దస్త్ లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వేణు సైడ్ అయ్యిపోవటం సుదీర్ టీమ్ లీడర్ అవ్వటం చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం సుదీర్ ఒక పక్క టివి రంగంలో అనేక షో లు చేస్తూ మరో పక్క కమెడియన్ గా సినిమా రంగంలోనూ బిజీగా ఉన్నాడు. చదువు మధ్యలోనే ఆపేసిన కష్టపడి పైకి వచ్చి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సమయం వచ్చినప్పుడల్లా సుదీర్ తన గతం గురించి చెపుతూనే ఉంటాడు.