Kitchenvantalu

Methi Turmeric Tea:ఈ టీ తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..

Methi Turmeric Tea: మారుతున్న ఈ సీజన్‌లో ఈ టీ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టీని రోజు విడిచి రోజు తాగితే మంచిది.

కావలసిన పదార్ధాలు
1 స్పూన్ మెంతులు
1/2 టీస్పూన్ పసుపు
1 కప్పు నీరు
తేనె రుచి కోసం

తయారి విధానం
పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి ఒక స్పూన్ మెంతులను వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పసుపు వేసి రెండు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వడకట్టి తేనే కలుపుకొని తాగాలి.

ఈ డ్రింక్ ని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనే లేకుండా తీసుకుంటే మంచిది. సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే అధిక బరువును తగ్గిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.