Oats Moong Dal Tikki Recipe:ఓట్స్ తో ఉదయం ఇలా బ్రేక్ ఫాస్ట్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది
Oats Moong Dal Tikki Recipe:oats తో ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చేయటం కూడా చాలా సులువు.
కావలసిన పదార్ధాలు
3/4 కప్పు పెసర పప్పు
3/4 కప్పు వోట్స్
1 ఉల్లిపాయ (ముక్కలుగా కట్ చేయాలి)
1 క్యారెట్ (తురమాలి)
1 టేబుల్ స్పూన్ పెరుగు
1 స్పూన్ గరం మసాలా
1 టీస్పూన్ ఎర్ర మిరప పొడి
రుచికి ఉప్పు
1 టేబుల్ స్పూన్ నూనె
కొత్తిమీర ఆకులు
నీరు అవసరానికి తగ్గట్టు
తయారి విధానం
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిని పోసి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. ఓట్స్‌ను పాన్‌లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించి మిక్సిలో వేసి బరకగా మిక్సీ చేయాలి. ఓట్ పౌడర్ ని కొంచెం పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో, మెత్తని పప్పు, తురిమిన క్యారెట్, ఉల్లిపాయ మరియు సిద్ధం చేసిన ఓట్ పౌడర్ వేసి కలపాలి. ఆ తర్వాత ఎర్ర కారం, గరం మసాలా, కొత్తిమీర మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
పిండిని సమాన పరిమాణంలో బంతులుగా విభజించి టిక్కీ ఆకారంలో తయారుచేసి…. వాటిని మిగిలిన ఓట్ పౌడర్‌తో కోట్ చేయండి. పాన్‌లో కొంచెం నూనె వేసి, దానిపై టిక్కీలను పెట్టి.. బంగారు గోధుమ రంగులోకి మరియు క్రిస్పీగా మారే వరకు వాటిని ఫ్రై చేయండి. గ్రీన్ చట్నీతో వేడిగా వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.