Guppedantha manasu serial:వసుధార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Guppedantha manasu serial:వసుధార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. గుప్పెడంత సీరియల్ లో వసుధార పాత్రలో నటిస్తున్న రక్షా గౌడ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట్లో కొన్ని సీరియల్స్ చేసిన సరే.. గుప్పెడంత మనస్సు సీరియల్ తో ఆమె రేంజ్ మారిపోయింది. వసుగా అమ్మడు.. అల్లరి, సీరియస్ నెస్, రిషితో గొడవలు.. ఆమె క్యారెక్టర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.
వసుధార ఈ సీరియల్ కోసం ఎంత చార్జ్ చేస్తుందనే విషయానికి వస్తే.. ఎపిసోడ్ ను బట్టి ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నాలుగు రోజులు పట్టొచ్చు. అలా ఆమె ఒక్కో ఎపిసోడ్ కు రూ.17 వేలు అందుకుంటుందట.
ఇలా సీరియల్స్ లో నటిస్తున్న కన్నడ భామలు బాగానే సంపాదిస్తున్నారు. ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే.. మరో పక్క యాడ్స్ లో కూడా నటిస్తుంది.