Guava Leaves:పరగడుపున రెండు ఆకులను తింటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Guava Leaves:మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి గురించి తెలియక వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. అలాంటి మొక్కలలో జామ చెట్టు ఒకటి. జామ ఆకులలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు.
అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం జామ ఆకుల రసం తాగితే… మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి.
చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే మంచిది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే.
ఈ నీరు రుచిగా ఉండకపోయినా… ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను చంపేసి… గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, ఫైబర్… గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్స్ మేలు చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.