Sweet Corn:స్వీట్ కార్న్ కనిపిస్తే అసలు వదలద్దు.. ముఖ్యంగా ఈ సమస్యలు దూరం..
Sweet Corn:స్వీట్ కార్న్ కనిపిస్తే అసలు వదలద్దు.. ముఖ్యంగా ఈ సమస్యలు దూరం.. ప్రస్తుతం ఈ సీజన్ లో స్వీట్ కార్న్ చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. ఏ సీజన్ లో లభించే వాటిని అసలు మిస్ కాకుండా తినాలి. అప్పుడే వాటి ప్రయోజనాలను పొందుతాము.
స్వీట్ కార్న్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. మలబద్దకం వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించటంలో సహాయ పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినవచ్చు. స్వీట్ కార్న్ లో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి, సంతృప్త కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
అందువల్ల మొక్కజొన్న తినటం వలన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్యప్రక్రియను ఆలస్యం చేసి చర్మం యవన్నంగా ఉండేలా చేస్తుంది. దీనిలో ఫోలేట్ సమృద్ధిగా ఉండుట వలన దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయటమే కాకుండా కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. దీనిలో విటమిన్ E కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన మొటిమలను తగ్గిస్తుంది. స్వీట్ కార్న్ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేయాలి.
స్వీట్ కార్న్ లో విటమిన్ సి, లైకోపీన్ కంటెంట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలకుండా బలంగా పెరిగేలా చేస్తుంది. sweet Corn లో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే కెరోటినాయిడ్స్ మరియు బయోఫ్లేవనాయిడ్స్, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు sweet Corn తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్నీ ప్రయోజనాలను పొందవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.