Chiranjeevi:చిరంజీవిని కన్నీళ్లు పెట్టించి రెండు రోజులు తిండి, నిద్ర లేకుండా చేసిన సినిమా..
Chiranjeevi:తెలుగు చిత్ర సీమలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ అయ్యాడు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్,కృష్ణ ల తర్వాత ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ గల హీరోగా మెగాస్టార్ చిరంజీవిని చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలాడు. రాజకీయాల్లో చేరి, 9సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ, తెలుగులో తన స్టామినా తగ్గలేదని,ఖైదీ నెంబర్ 150తో నిరూపించాడు.
అలాంటి మెగా హీరో ఓ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడట. తన కెరీర్ లో అలాంటి మూవీ లేనందుకు చాలా బాధపడ్డాడట. తనలోని నట విశ్వ రూపాన్ని చూపించాలంటే, తనకు అలాంటి మూవీ వస్తుందా రాదా అని తెగ ఫీలయ్యాడట. వివరాల్లోకి వెళ్తే,కమల్ హాసన్,రాధికా నటించిన కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమా అందరికీ తెలిసిందే.
చిరంజీవి నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 1980దశకంలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సరిగ్గా అప్పుడే స్వాతిముత్యం సినిమా చూసిన చిరంజీవి అప్పటివరకూ తన కెరీర్ లో అలాంటి మూవీ లేనందుకు తెగ బాధపడ్డాడట. రెండు రోజులు నిద్ర పట్ట్టలేదట. తిండి సహించలేదట.
ఓ మనిషి ఇలా కూడా నటిస్తాడా అని ఆశ్చర్యపోయాడట. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పడం విశేషం. ఇక ఆతర్వాత కొన్నాళ్ళకు తన అభిప్రాయాన్ని కె విశ్వనాధ్ దగ్గరకు వెళ్లి చిరంజీవి పంచుకున్నాడు.
ఇలాంటి కంటెంట్ గల సినిమా తీసి తనలోని నటనను బయటకు తీయాలని, ఆ సినిమా ఆడకపోయినా పర్వాలేదని చిరు అన్నాడట. అలా పుట్టిందే స్వయంకృషి మూవీ. చిరుకు స్టార్ డమ్ లేని రోజుల్లో శుభలేఖ సినిమా విశ్వనాధ్ చేసినా,అంతగా జనానికి తెలీదు.
అయితే స్టార్ డమ్ ఉన్న సమయంలో తీసిన స్వయంకృషి మూవీ కి చిరంజీవి నట విశ్వరూపం చూపించే ఛాన్స్ వచ్చింది. చెప్పులు కుట్టే వేషం కనుక నిజంగా చెప్పులు కుట్టే వ్యక్తిని తీసుకొచ్చి సెట్ లో పెట్టుకుని అతడి సూచన మేరకు నటించాడట. ఇందులో విజయశాంతి జోడీ కట్టి,తన నటనతో అదరగొట్టింది. ఎపి ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.