Bald Head:బట్టతల వచ్చే సూచనలున్నప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలటం ఆగిపోతుంది
Bald Head Home Remedies:బట్టతల వచ్చే సూచనలున్నప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలటం ఆగిపోతుంది..ఎన్నో అనారోగ్యాల మాదిరిగానే బట్టతల వచ్చే ముందు కూడా కొన్ని సూచనలు కనిపిస్తాయి. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం, ఒకే ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా ఊడిపోవడం అనేది బట్టతలకు సంకేతం.
నెత్తిపై జుట్టు పల్చగా ఉండడంతో పాటుగా తల మొత్తం బోసిపోయి కనిపిస్తుంది. ఈ సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే బట్టతల సమస్య రాకుండా నివారించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకూ ఏం చేయాలో కింద తెలుసుకుని మీ తలపై నిండుగా వెంట్రుకలు ఉండేలా చూసుకోండి..
కావల్సిన పదార్థాలు:
* 20ఎంఎల్ కొబ్బరి నూనె
* 10ఎంఎల్ ఉసిరి నూనె
* రెండు స్పూన్ల నిమ్మరసం
చిట్కా-1:
ఈ మూడు పదార్థాలను కలిపి తలమీద కుదుళ్ల వద్ద నెత్తికి రాసి కొంచెం సేపు అలా వదిలేయాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి. తర్వాత నేచురల్ షాంపూ లేదా కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3, 4 సార్లు చేస్తే బట్టతల అనే మాటే ఉండదు. సమస్య తీవ్రతను బట్టి ఎన్ని వారాలు వాడాలో మీరే నిర్ణయించుకోండి.
చిట్కా-2:
కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఓసీసాలో పోసి భద్రపర్చుకోవాలి. ప్రతి రోజు ఉసిరి నూనెను జుట్టుకు రాసి 15 నిమిషాలయ్యాక స్నానం చేయాలి. ఇలా చేస్తే కూడా జుట్టు రాలడం ఆగిపోతుంది. దీంతో బట్టతల వచ్చే సమస్య తప్పిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.