Moringa leaves:డయాబెటిస్,రక్తహీనతను తగ్గించే ఐరన్, కాల్షియం రిచ్ ఆకు తింటే రోగనిరోదక శక్తి పెరుగుతుంది
Moringa leaves:డయాబెటిస్,రక్తహీనతను తగ్గించే ఐరన్, కాల్షియం రిచ్ ఆకు తింటే రోగనిరోదక శక్తి పెరుగుతుంది.. మునగ చెట్టు రోడ్డు పక్కన చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇంటిలో పెంచుకుంటూ ఉంటారు.
మునగకాడలుని ముక్కలుగా చేసి సాంబార్లో పులుసులో అలాగే చాలా వంటల్లో దీనిని వాడుతూ ఉంటారు. అయితే మునగ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుతో పప్పు,పచ్చడి,పొడి చేసుకొని తినవచ్చు.
ఈ ఆకులలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక స్పూన్ మునగ ఆకు పొడిని తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడతాయి.
ఇందులో యాంటీఆక్సిడెంట్ క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాఫీలో కూడా ఉంటుంది. దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాక ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది . ఇది టైప్ -2 డయాబెటిస్ రోగులలో రక్తంలోని చక్కెర, రక్తపోటును తగ్గిస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
మునగ ఆకులలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది వచ్చే నొప్పులను తగ్గించి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆకులలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. మునగ ఆకు చాలా విరివిగా లభిస్తుంది. కాబట్టి ఈ ఆకును ఉపయోగించి సమస్యల నుంచి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.