Actress Kavya:గంగోత్రి సినిమా చిన్నారి ఎంత అందంగా ఉందో…ఎన్ని సినిమాల్లో నటిస్తుందో తెలుసా?
Actress Kavya:దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ఆరంగేట్రం చేసిన గంగోత్రి సినిమాలో హీరో హీరోయిన్స్ చిన్నప్పుడు పాత్రల్లో ఇద్దరు చిన్నారులు తమ నటనతో అదరగొట్టేసారు. ఇందులో అల్లు అర్జున్ చిన్ననాటి పాత్ర లో నటించిన తేజా సర్జా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఇప్పటికే ఓ బేబీ మూవీలో తానేమిటో చూపించాడు.
మరో చిన్నారి కావ్య మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా దుమ్మురేపింది. తర్వాత స్టడీస్ మీద దృష్టి పెట్టడంతో ఎక్కడా కనిపించలేదు. కావ్య చదువొక్కటే కాకుండా డాన్స్ పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
కొన్నాళ్ల క్రితం లాయర్ గా పూణే యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుంది. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్న ఈమె అదిరిపోయే షూట్ చేసి షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ముద్దుగా బొద్దుగా ఉంటూ గంగోత్రి ఎలా మారిపోయింది అని ఫాన్స్ ముచ్చట పడుతున్నారు. తెలుగులో మంచి పట్టు ఉండడంతో హీరోయిన్ గా కాకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నైనా తన టాలెంట్ ఏమిటో చూపించాలని అనుకుంటోంది. మరి ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో కావ్య అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అటు ‘ఉస్తాద్’ సినిమాలో కూడా కావ్య హీరోయిన్‌గా నటించింది.