White Hair Turn Black: ఒకే ఒక్క ఆకుతో తెల్ల జుట్టు మాయం..
White Hair Turn Black: ఒకే ఒక్క ఆకుతో తెల్ల జుట్టు మాయం.. తెల్లజుట్టు చాలా చిన్న వయస్సులోనే రావటం వలన చాలా కంగారు పడుతూ ఉంటారు. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటి గురించి మనకు పెద్దగా తెలియక పెద్దగా పట్టించుకోము. వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
అలాంటి మొక్కలలో జామ చెట్టు ఒకటి. జామ చెట్టు ఆకులలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్యకు జామ ఆకు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. అలా చిన్న వయస్సులోనే రావటంతో మానసికంగా క్రుంగిపోతున్నారు. అలాగే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటున్నారు.
దాంతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా కాకుండా కాస్త ఓపికతో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. జామ ఆకుల రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.