Beauty Tips

Pimples:ఇలా చేస్తే ఒక్క రోజులో మొటిమలు మాయం అవుతాయి

Pimples Home Remedies:ఇలా చేస్తే ఒక్క రోజులో మొటిమలు మాయం అవుతాయి.. ముఖం మీద మొటిమలు ఉంటే ముఖం చూడటానికి అందంగా ఉండదు. అందుకే మొటిమలు,మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు బాగా సహాయపడతాయి.

ఒక చిన్న బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానా మట్టి, అంతే మోతాదులో గంధం పొడి, రెండు చుక్కల అల్లం రసం, కోడిగుడ్డులోని తెల్ల సొన, టీ స్పూన్ రోజ్‌వాటర్ బాగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

కొన్ని తులసి ఆకులు అంతే పరిమాణంలో పుదీనా ఆకులను తీసుకుని కొన్ని చుక్కల నీటిని జత చేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 30 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

రెండు టీ స్పూన్ల పసుపులో ఒక టీ స్పూన్ రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌లను వారంలో ఒకసారి క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.