BusinessDevotional

IRCTC Shirdi Tour : ఈ నెలలో షిర్డీ వెళ్ళే ఆలోచన ఉందా? విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ..

IRCTC Shirdi Tour : ఈ నెలలో షిర్డీ వెళ్ళే ఆలోచన ఉందా? విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ.. ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే ప్యాకేజీలను ప్రకటిస్తుంది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ జులై 30, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

“SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో 4 రోజుల ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా బుకింగ్ చేసుకున్న వాళ్లు రైలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది.

ఈ ప్రయాణం మొదటి రోజు అంటే జూలై 30 న రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలు అవుతుంది.

రెండో రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. సాయంత్రం కొంత సేపు షాపింగ్.. ఆ తర్వాత రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

మూడోవ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకొని రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఇక ధరల విషయానికి వస్తే..

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,165..డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,985..సింగిల్ షేరింగ్ కు రూ. 13705.. డబుల్ షేరింగ్ కు రూ. 7590గా ఉంది.

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.