Oats Masala Vada Recipe : ఓట్స్‌తో మసాలా వడలు చాలా సింపుల్‌గా చేసేయొచ్చు..
Oats Masala Vada Recipe : ఓట్స్‌తో మసాలా వడలు చాలా సింపుల్‌గా చేసేయొచ్చు.. ఓట్స్ మసాలా వడ..ఈవినింగ్ కాస్త రిలాక్సేషన్ టీ కంపల్సరీ,
దానికి తోడు కాస్త సాలిడ్ ఫుడ్ కూడా యాడ్ చేసుకుంటే,ఆకలి తీరుతుంది.
మైండ్ రిఫ్రెష్ అవుతుంది.టీ కాంబినేషన్ కి ఓట్స్ మసాలా వడ యాడ్ చేసుకోండి.డైట్ లో ఉన్న వారికి కూడా వర్క్ అవుట్ అవుతుంది.
కావాల్సిన పదార్ధాలు
పచ్చి శనగపప్పు – ½ కప్పు
ఓట్స్ – ¾ కప్పు
తరిగిన ఉల్లిపాయలు – 1/2కప్పు
తరిగిన కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 1 స్పూన్
ఉప్పు – తగినంత
తరిగిన పచ్చిమిర్చి -1 టేబుల్ స్పూన్
కారం – 1 టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా శనగపప్పును, శుభ్రంగా కడిగి,నీళ్లు పోసి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి.
2.నానిన శనగపప్పును, వడకట్టుకుని, నీరు కలపకుండా, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న శనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులోకి ఉప్పు, ఓట్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాలు, పచ్చిమిర్చి, కారం, అన్ని వేసుకుని, ముద్దగా కలుపుకోండి.
4.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, వేడెక్కనివ్వాలి.
5. ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని , అరచేతిపై వడలుగా వత్తుకుని, వేడెక్కిన నూనెలో వేయాలి
6. రెండు వైపులా ఎర్రగా లోపల ఉడికేలా మీడియం ఫ్లేమ్ పై వేయించుకోవాలి.
7. అంతే వేడి వేడి ఓట్స్ మసాలా వడ రెడీ.