Beauty Tips

Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం.. ముఖం మీద ముడతలు,మచ్చలు లేకుండా తెల్లగా,కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా ముడతలు,మచ్చలను తొలగించుకొని యంగ్ లుక్ లో కనిపించవచ్చు.
lemon benefits
ఈ రెమిడి కోసం కేవలం మూడే మూడు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవి మనకు చాలా సులభంగా అందుబాటులో ఉండేవే. రెండు నిమ్మ పండ్లను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసి పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఒక బౌల్ లో ఈ జ్యూస్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, మూడు స్పూన్ల తేనె వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసాలా కలుపుకుని ఒక సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ముఖానికి, మెడకు ఈ మిశ్రమాన్ని రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని అరగంట అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Honey
ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే చర్మంపై ఉన్న నల్లని మచ్చలు, మొండి మచ్చలు, ముడతలు అన్ని తొలగిపోయి ముఖం టైట్ గా కాంతివంతంగా తెల్లగా మెరిసిపోతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలు రాకుండా కాపాడుతుంది. ఒక్కసారి చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు వాడుకోవచ్చు.
Wrinkles remove Tips In Telugu
నిమ్మకాయ,ఆలివ్ ఆయిల్,తేనె…ఈ మూడింటిలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన తేమను అందించి పొడిగా లేకుండా ముడతలు రాకుండా కాపాడటంలో సహాయపడతాయి. కాస్త ఓపికగా ఇలా ఇంటి చిట్కాలను ఫాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK