MoviesTollywood news in telugu

Anchor Syamala:యాంకర్ శ్యామల పెళ్ళిలో జరిగిన ఈ ట్విస్ట్ మీకు తెలుసా?

Anchor Syamala:యాంకర్ శ్యామల పెళ్ళిలో జరిగిన ఈ ట్విస్ట్ మీకు తెలుసా.. తెలుగు టివీ రంగంలో యాంకర్ శ్యామల తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతుంది.

ఒక పక్క టివీ షో లలో యాంకరింగ్ చేస్తూనే సినిమా వేడుకలకు యాంకరింగ్ చేస్తూ.. మరో పక్క సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే చేస్తూ బిజీగా ఉంది. శ్యామల అభిమానుల కోసం కొన్ని విషయాలను తెలుసుకుందాం.

అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ,సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేస్తూ తెలుగు చానల్స్ లో దుమ్మురేపుతున్న యాంకర్ శ్యామల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో కూడా పద్దతిగానే నటించిన శ్యామల సీరియల్స్ చేస్తూనే టివిలో వంటల పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ యాంకరింగ్ అదరగొట్టింది. కాకినాడలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్యామలకు ఏడాది వయస్సులోనే తండ్రి చనిపోయాడు. ఈమెకు ఒక అక్క ఉంది. దీంతో తల్లి కష్టపడి పెంచింది. ప్రభుత్వ స్కూల్ లో పదవతరగతి వరకూ చదివిన ఈమె కాకినాడ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ చదివింది.
Anchor Syamala
చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్యామల కు నాటకాలంటే కూడా చాలా ఇష్టం ఉండేదట. అలా ఐదేళ్లు నాటకాలు వేసింది. ఇక 16ఏళ్ళ ప్రాయంలో పాలకొల్లులో జరిగే సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొన్నప్పటికీ ఆమె సెలెక్ట్ కాలేదు. తల్లి ఎంకరేజ్ మెంట్ తో సీరియల్స్ లో నటించాలని హైదరాబాద్ వెళ్లిన ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అన్వేషణ అనే సీరియల్ లో కూడా ఎంపికవ్వలేదు. అయితే లయ సీరియల్ లో నటించే ఛాన్స్ వచ్చింది.

ఆతర్వాత జి తెలుగులో హ్యాపీ డేస్ అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కింది. ఆతర్వాత ఈటీవీలో అభిషేకం సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. జెమినిలో గోరింటాకు సీరియల్ లో నటించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీరియల్ లో చేసింది. నెగెటివ్ క్యారెక్టర్స్ తో సీరియల్స్ చేస్తున్న శ్యామలకు మాటీవీలో మావూరి వంట ప్రోగ్రాం లో యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది . గాయం -2మూవీ ఆడియో ఫంక్షన్ కి హోస్ట్ గా చేసింది. ఆతర్వాత చాలా ఆడియో ఫంక్షన్స్ కి హోస్ట్ గా చేసింది.

ఇక గుండెల్లో గోదారి మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చింది. అయితే భర్తకు సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఒప్పుకోలేదు. కానీ అత్తమామలు ఎంకరేజ్ చేయడంతో ఆ సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఒక లైలా కోసం,లౌక్యం,బెంగాల్ టైగర్,సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించింది. విషయం ఏమిటంటే టెన్త్ చదివే సమయంలో కళాకండి సీరియల్ లో నటించే నరసింహ అనే వ్యక్తిపై మనసు పారేసుకుంది. ఆతర్వాత సీరియల్స్ లో నటించడానికి హైదరాబాద్ వచ్చినపుడు నరసింహ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వెదికిందట.

మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాలో నరసింహకు జోడీగా నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆమె లవ్ లో పడింది. ఈ సీరియల్ 250ఎపిసోడ్స్ పూర్తయిన సందర్బంగా నరసింహకు ప్రపోజ్ చేసిందట. తల్లికి విషయం చెప్పగా, ఆమె ఒప్పుకోలేదట. అయినా పెళ్లి చేసేసుకోవడంతో ఆ పెళ్ళికి తల్లి రాలేదు.  Bigg boss లో కూడా పార్టిసిపేట్ చేసింది.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK