MoviesTollywood news in telugu

Nutan Prasad:బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో నూతన్ ప్రసాద్ తన కాళ్ళను పోగొట్టుకున్న విషాద గాధ

Nutan Prasad:బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో నూతన్ ప్రసాద్ తన కాళ్ళను పోగొట్టుకున్న విషాద గాధ.. తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ 1973లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. బాపు డైరెక్షన్ లో అక్కినేని హీరోగా వచ్చిన అందాల రాముడు మూవీతో పరిచయం అయిన నూతన్ ప్రసాద్ విలన్ గా, క్యారెక్టర్  ఆరిస్టుగా ,హీరోగా, కమెడియన్ గా,తండ్రిగా, తాతగా, ఇలా అన్ని రకాల పాత్రలలో ఒదిగిపోయాడు.

నటనతో పాటు అద్భుత డైలాగ్ డెలివరీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కామెడీ టచ్ తో విలనిజానికి కొత్త భాష్యం చెప్పారు. అయితే ఆయన కెరీర్ లో విషాద భరితంగా బామ్మ మాట బంగారు బాట మూవీ మిగిలిపోయింది. ఏవిఎం సంస్థ తీసిన ఈ సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ జరిగి నూతన్ ప్రసాద్  రెండు కాళ్ళు పోగొట్టుకుని వీల్ చైర్ కి పరిమితం అయ్యాడు. అక్కడి నుంచి నటనకు దూరం అయ్యాడు.

ఆరోజు నూతన్ ప్రసాద్ తో పాటు కారులో ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ అసలు ఆరోజు ఏం జరిగిందో మీడియాతో పంచుకున్నాడు. ‘సహనటుడు గానే కాదు , నేను నూతన్ ప్రసాద్ మంచి ఫ్రెండ్స్ కూడా. నేను ఆయన్ని చిన్నోడా అని పిలిస్తే ఆయన నన్ను పెద్దోడా అని పిలిచేవారు’అని గుర్తుచేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు తాను డ్రైవింగ్ సీట్లో ఉంటె , ఆయన వెనుక సీట్లో కూర్చున్నారని,కథ ప్రకారం సూపర్ కారులో సారా పోయగానే గాలిలోకి తేలాల్సి ఉందని చెప్పారు.

కారుకి గొలుసు కట్టి క్రేన్ తో పైకి లేపేవిధంగా ఏర్పాట్లు చేసారు. అయితే గొలుసు గల లింక్ అప్పటికే సగం ఊడిపోయింది. గాలిలో ఒకటి రెండు సార్లు లేవాల్సి రావడంతో గొలుసు లింక్ పూర్తిగా తెగి,పెద్ద శబ్దంతో కిందికి పడిపోయింది. ఈలోగా పెద్దోడా పట్టుకో  అని నూతన్ ప్రసాద్ గట్టిగా అరిచేలోగా తాను కింద పడి  స్పృహ కోల్పోవడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.

కానీ నూతన్ ప్రసాద్ లేవలేకపోయారు. తనకు స్పృహ లేకున్నా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ గట్టిగా నూతన్ ప్రసాద్ మాట్లాడ్డం వినిపిస్తూనే ఉందని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఆసుపత్రిలో చేర్చగా,వెన్నెముకలో ఒకదానిలో ఒకటి దిగిపోయిదని,ఆతర్వాత పక్షవాతం కూడా వచ్చిందని వివరించాడు. ఇక అప్పటికే 32 సినిమాలు చేతిలో ఉన్నాయి.

ఇంతటి బిజీ నటుడు ఆతర్వాత అతి తక్కువ సినిమాలకు పరిమితం అయ్యాడు. ఈటీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రాంతో తన డైలాగ్ డెలివరీ తో వ్యాఖ్యాతగా పాపులర్ అయ్యాడు. వీల్ చైర్ లో చివరి వరకూ ఉన్న ఆయన 2011లో కన్నుమూశారు. చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్ళినపుడు ‘ఏరా పెద్దోడా, ఇద్దరం ఒకే కారులో ఉన్నాం కదా మరి నాకే ఎందుకు దెబ్బలు తగిలి ఇలా అయ్యాను’అని అడిగేవారని రాజేంద్ర ప్రసాద్ ఎమోషన్ అయ్యారు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK