MoviesTollywood news in telugu

Sekhar master:శేఖర్ మాస్టర్ ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరో తెలుసా…

Sekhar master:శేఖర్ మాస్టర్ ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరో తెలుసా… శేఖర్ మాస్టర్ ఒక పక్క సినిమా రంగంలోనూ మరియు tv రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇప్పటి తరానికి వెరైటి డాన్స్ స్టెప్స్ ఉండాల్సిందే. అలాంటి స్టెప్స్ ని క్రియేట్ చేయటంలో శేఖర్ మాస్టర్ ముందు వరుసలో ఉంటారు. ఏ హీరోకి ఏ స్టెప్ సెట్ అవుతుందో చూసి మరి కంపోజ్ చేస్తూ ఉంటారు. ఒక వైపు హీరోల మనస్సులో…మరొక వైపు అభిమానుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు.

గతంలో సినిమాల్లో కొరియోగ్రఫీ వేరు … ఇప్పుడు వేరు … ఎన్టీఆర్ ,అక్కినేని హయాంలో డాన్స్ మాస్టర్స్ వేరు,ఇప్పుడు వేరు … అసలు స్టెప్పులేయడంలో అక్కినేనితో మొదలయిందని అంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వచ్చాక పాటల డాన్స్ కంపోజ్ మొత్తం మారిపోయింది. కుర్ర హీరోలలో చాలామంది డాన్స్ కి పెద్దపీట వేస్తున్నారు. దాంతో కొరియోగ్రాఫర్ కి విలువ కూడా భారీగానే పెరిగింది.

ఇప్పుడు అందరినోటా విన్పించే పేరు శేఖర్ మాస్టర్ పేరు. గతంలో లారెన్స్, ప్రభుదేవా,లాంటి కొరియోగ్రాఫర్స్ పేర్లు ఎక్కువగా విన్పించేవి ఇప్పుడు చాలామంది వచ్చారు. అయితే అందులో శేఖర్ మాస్టర్ ఎడాపెడా సంతకాలు చేస్తూ,అందరి హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఢీ షో ద్వారా పరిచయమైన శేఖర్ మాస్టర్ ఇప్పుడు అన్ని హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజర్ అయ్యాడు.

ఏరికోరి శేఖర్ మాస్టర్ ని హీరోలు ప్రతిపాదిస్తున్నారంటే ఇతడి క్రేజ్ చెప్పక్కర్లేదు. అయితే ఇంతటి విజయం వెనుక ఎంతటి కష్టం దాగుందో చెప్పాలంటే మాటలు కాదు. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్ని కష్ఠాలను ఓర్చి ఎదురొడ్డి నిలిచాడో, ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించాడో అంతకన్నా అతడి విజయంలో ఎంకరేజ్ చేసిన వాళ్ళ కృషి కూడా అంతేస్థాయిలో ఉందట.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో శేఖర్ మాస్టారుకి మండపేటకు చెందిన కిరణ్ తో సంగీత్ ప్రోగ్రాంలో ఏర్పడ్డ పరిచయం గొప్ప ఫ్రెండ్ షిప్ గా మారింది. కారుకోనాలన్నా, మొబైల్ కొనాలన్నా సరే, కిరణ్ వెంట రావాల్సిందే. అలాగే కో డైరెక్టర్ వినయ్ కూడా శేఖర్ జర్నీలో ముఖ్యమైన భాగం. ఇక ఇతనికి డాన్స్ నేర్పిన రాకేష్ అంటే చెప్పలేని అభిమానం. ప్రతిసారి ఇతడి గురించి చెబుతూనే ఉంటాడు.

ఇక డాన్స్ కంపోజ్ లో కొత్తది సృష్టిస్తే ముందుగా ఒకే చేయాల్సింది శేఖర్ భార్య అని చాలామందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి,జూనియర్ ఎన్టీఆర్, బన్నీ,రామ్ చరణ్, మహేష్ బాబు,వెంకటేష్ , నితిన్, వరుణ్ తేజ్, నాని,నాగచైతన్య, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా అందరూ ఇచ్చిన ప్రోత్సాహమే తనను టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా నిలబెట్టిందని శేఖర్ చెబుతాడు.