Diabetes:డయాబెటిస్ ఉన్నవారు ఈ రసం తాగితే…షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Diabetes:డయాబెటిస్ ఉన్నవారు ఈ రసం తాగితే…షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది.. డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ ఉన్న వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని మూలికలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడతాయి. కొంత జీవనశైలి అలవాట్లను కూడా మార్చుకోవాలి. ప్రతి రోజు తప్పనిసరిగా అరగంట వ్యాయామం చేయాలి. ఇప్పుడు చెప్పే రసాలలో ఏదో ఒక దానిని తీసుకుంటే సరిపోతుంది.
ఈ మధ్యకాలంలో తిప్పతీగ చాలా ప్రాచుర్యం పొందింది. డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. తిప్పతీగ రసాన్ని ప్రతి రోజు ఉదయం తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మునగ ఆకులలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అలాగే మునగ ఆకులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. మునగ ఆకుతో పొడి తయారుచేసుకొని తీసుకోవచ్చు..లేదంటే మునగ ఆకుతో టీ తయారుచేసుకొని తాగవచ్చు.
వేప ఆకులలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెప్పుతున్నారు. వేప ఆకు డయాబెటిస్ ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో…అనే దాని మీద చాలా పరిశోదనలు చేశారు. వేప ఆకు రసం లేదా వేప ఆకు నమిలి తినడం వల్ల డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఇప్పుడు చెప్పిన తిప్పతీగ, మునగ,వేప…ఈ మూడు కూడా డయాబెటిస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీకు లభ్యం అయినా దాన్ని బట్టి ఈ మూడింటిలో ఒక్క దాన్ని ప్రతి రోజు తీసుకుంటే సరిపోతుంది. వేప ఆకు, తిప్పతీగ, మునగ ఆకు ఈ మూడు కూడా చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.